తెరాస ప్రభుత్వం నిర్ణయాలు ప్రజాకంటకంగా మారాయి: భట్టి

తాజా వార్తలు

Updated : 26/09/2021 11:10 IST

తెరాస ప్రభుత్వం నిర్ణయాలు ప్రజాకంటకంగా మారాయి: భట్టి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం నిర్ణయాలు ప్రజాకంటకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి నిరుద్యోగ సమస్యపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని భట్టి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, పంజాగుట్టలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే పార్టీ తరపున విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని