ప్రభుత్వ మార్పునకు సాగర్‌లోనే నాంది: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 13:15 IST

ప్రభుత్వ మార్పునకు సాగర్‌లోనే నాంది: ఉత్తమ్‌

హాలియా: నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ విజయంతో రాష్ట్రంలో మార్పులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‘జనగర్జన’లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వీహెచ్‌, జానారెడ్డి సభకు హాజరయ్యారు. 2023లో ప్రభుత్వ మార్పునకు నాగార్జునసాగర్‌లోనే నాంది పడాలన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి తెరాస చేసింది శూన్యమని విమర్శించారు. ఇక్కడ భాజపాకు డిపాజిట్‌ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి వరాలు కురిపించి ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని చురకలంటించారు. ఆ ఆరేళ్ల కాలంలో సాగర్‌కు తెరాస ఏం చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు. సాగర్‌ ప్రజల ప్రేమాభిమానాలతో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

మండల వ్యవస్థకు ఆద్యుడిని: జానారెడ్డి    
నాగార్జున సాగర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది తానేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఏం చేశారంటూ తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారని, తనతో వస్తే ఏం చేశానో చూపిస్తానని సవాల్‌ విసిరారు. జానారెడ్డి అంటే పోరాటయోధుడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థకు ఆధ్యుడనని, భారతదేశంలోనే ఒక ఆలోచనని కలిగించానని, అలాంటి జానారెడ్డినే ప్రశ్నించే అర్హత కేసీఆర్‌కు ఉన్నదా అని విమర్శించారు. పోడు భూములపై గిరిజనుల తరఫున పోరాడుతానని వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని