close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎసైన్డ్‌ భూములన్నింటిపై విచారణ చేయాలి: జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ఎసైన్డ్‌ భూములన్నింటి వ్యవహారాన్ని వెలికితీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎసైన్డ్‌ భూముల వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు కమిటీ వేస్తానని ముఖ్యమంత్రి చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అన్యాక్రాంతమైన ఎసైన్డ్‌ భూములను గుర్తించి.. వాటిని అసలైన పట్టాదారులకు అప్పగించాలన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను దోషిగా చూపడం కోసం ఎసైన్డ్‌ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. ఇది మంచి పరిణామమే అయినా అన్ని ఎసైన్డ్‌ భూములపై విచారణ అవసరమన్నారు. దేవరయాంజల్‌ ఆలయ భూముల వ్యవహారంలో అంతా తెరాస నేతలే ఉన్నారని ఆరోపించారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియరీ అధికారాలు కల్పించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు