జగన్‌ దుర్మార్గ ఆలోచనలకు కళ్లెం: చంద్రబాబు
close

ప్రధానాంశాలు

జగన్‌ దుర్మార్గ ఆలోచనలకు కళ్లెం: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును తొలగించి, సంచైతా గజపతిరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తులు, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్‌ దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం కళ్లెం వేశాయని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుతోనైనా జగన్‌కు కనువిప్పు కలగాలని.. అరాచక పాలన, మూర్ఖపు జీవోలివ్వడానికి స్వస్తి పలకాలని ఒక ప్రకటనలో సూచించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని