రఘురామ వ్యవహారంలో నివేదిక సమర్పించండి
close

ప్రధానాంశాలు

రఘురామ వ్యవహారంలో నివేదిక సమర్పించండి

కేంద్ర హోంశాఖకు లోక్‌సభ సచివాలయం ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఏపీ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మాన నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంనుంచి వాస్తవ నివేదికను తెప్పించి 15 రోజుల్లోపు తమకు సమర్పించాలని లోక్‌సభ సచివాలయం కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులనిచ్చింది. ‘పోలీసు కస్టడీలో తనపై దాడిచేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌, అదనపు ఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌, ముఖ్యమంత్రి జగన్‌లకు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదనకు నోటీసునిచ్చారు. దీనిపై ఎంపీ కుమారుడు భరత్‌ మే15న ఫిర్యాదు చేశారు. దానిపైనా ఏపీ ప్రభుత్వం నుంచి వాస్తవ నివేదిక కోరాం. కస్టోడియల్‌ దాడి, చిత్రహింసలపై జూన్‌ 2న రఘురామకృష్ణరాజు నుంచి వచ్చిన తాజా నోటీసును కూడా హోంశాఖకు పంపుతున్నాం’ అని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని