రూ.వెయ్యి కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలి: ఉత్తమ్‌
close

ప్రధానాంశాలు

రూ.వెయ్యి కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలి: ఉత్తమ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఉస్మానియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసి కొత్తగా నిర్మాణం చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతంలోనే పాత భవనాలను కాపాడుతూ పక్కన ఉన్న ఏడెకరాల ఖాళీ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. గతేడాది తాను, వి.హనుమంతరావు తదితరులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి రోగుల ఇబ్బందులు, సౌకర్యాలు, కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి పరిశీలిస్తే ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టిందని గుర్తుచేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామని చెప్పారని, అందులో ఉస్మానియా ఆసుపత్రి లేకపోవడం విచారకరమని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

సీఎం ప్రొటోకాల్‌ పాటించకపోవడం విచారకరం: ఎంపీ కోమటిరెడ్డి

సంస్కారానికి మారు పేరైన తెలంగాణకు ప్రొటోకాల్‌ పాటించని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహిస్తూ స్థానిక ఎంపీని పిలవాలనే పరిజ్ఞానం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను మంగళవారం రాత్రి కలిసి ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేయాలని కోమటిరెడ్డి కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని