అమిత్‌షా నిద్రలోనూ ఎంఐఎంని తలచుకుని భయపడుతున్నారు: ఒవైసీ

ప్రధానాంశాలు

అమిత్‌షా నిద్రలోనూ ఎంఐఎంని తలచుకుని భయపడుతున్నారు: ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఎంఐఎం పేరు చెప్పందే మనుగడ లేని విధంగా తయారయ్యాయని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌ దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నిర్మల్‌ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల్ని చూస్తే భాజపాకు ఎంఐఎం అంటే ఎంతటి భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అమిత్‌షా నిద్రలోనూ తమ పార్టీని తలచుకుని భయపడుతున్నారని, ఆ కారణంగానే తరచూ తెలంగాణకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఏ పార్టీకీ భయపడదని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ ర్యాడికలైజేషన్‌ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎవరి వల్ల ర్యాడికలైజేషన్‌ పెరిగిందో, ఎవరికి నష్టం జరుగుతుందో ఆయన గ్రహించాలి’’ అని ఒవైసీ ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని