భాజపా నేతలవన్నీ అబద్ధాలే: పీయూసీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి

ప్రధానాంశాలు

భాజపా నేతలవన్నీ అబద్ధాలే: పీయూసీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా.. భారతీయ జనకంటక పార్టీగా మారిందని ప్రభుత్వరంగ సంస్థ శాసనసభా కమిటీ (పీయూసీ) ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కేంద్రంలోని ఆ సర్కారు తెగనమ్ముతోందని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా బిలియన్‌ మార్చ్‌ తథ్యమన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. రఘునందన్‌రావు వాస్తవాలు మాట్లాడడం లేదు. మాకు రావాల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా దిల్లీ వెళతాం. సీఎం నెలలో రెండుసార్లు దిల్లీకి వెళ్తే భాజపా, కాంగ్రెస్‌ నాయకులంతా ఆగమైపోతున్నారు’’ అని జీవన్‌రెడ్డి అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని