చంద్రబాబుపై మరో రెండు కేసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబుపై మరో రెండు కేసులు

గుంటూరు, నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై గుంటూరు, నరసరావుపేటల్లో రెండు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఎన్‌ 440కె వేరియంట్‌ ఉద్భవించిందని, ఇది 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేతలిద్దరూ కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మంగళవారం కేసు నమోదు చేశామని సీఐ కృష్ణయ్య తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు