ఈరోజు (03-10-2023)

ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో   చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ఈవారం (01-10-2023 - 07-10-2023)

అన్నివిధాలా మేలైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థికలాభాలు ఉన్నాయి. దైవబలం కాపాడుతోంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ,వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తిచేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీపార్వతీ పరమేశ్వర ఆరాధన శ్రేయస్కరం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

లైవ్ టీవీ

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని