ఈరోజు (23-04-2024)

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్య స్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవరోధాలను సమర్ధంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి.అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండాలి.ధనవ్యయం సూచితం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.  


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని