ఈరోజు (07-12-2023)

శుభ ఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది. 

ఈవారం (03-12-2023 - 09-12-2023)

వృత్తి,ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు.   అధికారుల వల్ల మేలు జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు.  చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

లైవ్ టీవీ