ఈరోజు (13-06-2024)

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. శ్రీలలితా దేవి స్తుతి చేయాలి.

ఈవారం (09-06-2024 - 15-06-2024)

శుభసమయం. ప్రారంభించిన పనుల్లో  శీఘ్ర విజయం ఉంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. భాగ్య బృహస్పతి యోగం విశేషమైన దైవబలాన్ని ఇస్తోంది. దైవ బలం ఉంది కాబట్టి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి. తోటివారితో  సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దశమంలో బుధ,శుక్రుల స్థితి అనుకూలంగా లేదు. కాబట్టి లక్ష్మీనారాయణ ధ్యానం శుభఫలితాన్ని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని