ఈరోజు (28-05-2023)

ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
 

ఈవారం (28-05-2023 - 03-06-2023)

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు.  తోటివారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు.  కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో  పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?