ఈరోజు (05-06-2023)

మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో  కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగాలి. మీరు చేసిన మంచి పనుల వల్ల ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి.  గణపతి సందర్శనం శుభప్రదం.

ఈవారం (04-06-2023 - 10-06-2023)

కార్యసిద్ధి ఉంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్ధిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యానం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని