ఈరోజు (27-09-2023)

కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

ఈవారం (24-09-2023 - 30-09-2023)

శ్రేష్ఠమైన కాలం. విజయసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితం సాధిస్తారు.  అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన మనఃస్సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

లైవ్ టీవీ

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని