నాన్నకు అప్పగించాలంటే భయమేస్తోంది..!

మేం ఇద్దరం అక్కచెల్లెళ్లం. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నాం. నాకు రెండు నెలల పాప ఉంది. మావారు వేరే ఊరిలో ఉంటారు.

Eenadu icon
By Vasundhara Team Published : 03 Nov 2025 01:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మేం ఇద్దరం అక్కచెల్లెళ్లం. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నాం. నాకు రెండు నెలల పాప ఉంది. మావారు వేరే ఊరిలో ఉంటారు. పాపనీ నన్నూ ఇప్పుడు అమ్మే చూసుకుంటోంది. కానీ నెలకు పది రోజులు చెల్లి దగ్గరకు వెళ్తా అంటోంది. ఇప్పుడు నేను ప్రసూతి సెలవుల్లో ఉన్నా... అవి అయ్యాక కూడా అమ్మ ఇలానే వెళితే నా పాపను ఎవరికి అప్పజెప్పాలో అర్థం కావడం లేదు. నాన్నకు పోర్న్‌ చూసే అలవాటు ఉంది. నా చిన్నప్పట్నుంచీ ఆయన ఫోన్‌ స్టోరేజ్‌లో అన్నీ ఆ వీడియోలే. ఆయన్ని నమ్మి పాపను అప్పగించలేను. పరిష్కారం తెలుపగలరు.

ఓ సోదరి

పెద్ద కూతురితోపాటు, చిన్నమ్మాయినీ చూసుకోవాలి అనుకోవడం మీ అమ్మగారి తప్పేం కాదు. అది ఆమె బాధ్యత. ఇకపోతే, వయసులో ఉన్నప్పుడు దాంపత్య జీవితం కోరుకున్న విధంగా లేకపోతే... ఆడ, మగ ఎవరైనా ఇలాంటి తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని  మనవరాలితోనూ అలా ప్రవర్తిస్తారేమో అని భయపడటం సబబు కాదు. అలా అని మీ భయాన్నీ పక్కన పెట్టలేం. రోజులు అసలే బాలేదు. కాబట్టి ఇప్పుడు మీకు రెండు దారులున్నాయి. ఒకటి సెలవుల్ని పొడిగించుకుని పాపకు రెండు మూడేళ్లు వచ్చే వరకూ మీరే దగ్గరుండి చూసుకోండి. పిల్లలకు తల్లి సంరక్షణ అవసరం అయ్యే వయసు ఇది. తనని ప్రీ-స్కూల్లో చేర్పించాక మళ్లీ కెరియర్‌ని మొదలుపెట్టొచ్చు. లేదూ మీ అమ్మగారు ఊళ్లో లేని రోజుల్లో పాపను చూసుకోవడానికి ఎవరైనా మహిళను నియమించుకోండి. మీ నాన్నగారి పర్యవేక్షణ ఉండేట్లు చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్