ఈరోజు

శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఒక వార్త  మానసిక  శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.
 

ఈవారం (14-08-2022 - 20-08-2022)

మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.  ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.  అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది.  స్థిరాస్తి  కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.  కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.  అనారోగ్య సమస్యలు  కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?