ఈరోజు (25-06-2024)

ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు,మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఇష్టదేవతా ఆలయ సందర్శనం శుభప్రదం.

ఈవారం (23-06-2024 - 29-06-2024)

బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. వ్యాపారపరంగా​ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి.​ ఒత్తిళ్లను అధిగమిస్తారు. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. శ్రీసూర్య నారాయణమూర్తిని ఆరాధిస్తే మంచిది.


మీ రాశి

images images images

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని