మంజ్రేకర్‌కు వీడ్కోలు రహస్యం చెప్పిన ధోనీ!
close

తాజా వార్తలు

Published : 09/08/2020 00:25 IST

మంజ్రేకర్‌కు వీడ్కోలు రహస్యం చెప్పిన ధోనీ!

ముంబయి: టీమ్‌ఇండియాలో అత్యుత్తమ స్ప్రింటర్‌ను ఓడించేంత వరకు ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ వెల్లడించారు. అతడే ఈ విషయాన్ని స్వయంగా తనతో చెప్పాడని పేర్కొన్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020లో మహీ రాణిస్తాడని అంచనా వేశారు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో ఆయన‌ మాట్లాడారు.

‘2017లో విరాట్‌ కోహ్లీ పెళ్లికి హాజరైనప్పుడు కాసేపు ధోనీతో మాట్లాడాను. టీమ్‌ఇండియాలో అత్యుత్తమ పరుగుల వీరుడిని ఓడించినంత వరకు అంతర్జాతీయ క్రికెట్‌ లేదా అత్యున్నత స్థాయి క్రికెట్‌కు తాను ఫిట్‌గా ఉన్నట్టు పరిగణిస్తానని చెప్పాడు. సచిన్‌, మహీ వంటి క్రికెటర్లు విజేతలు. వారెంత దృఢంగా ఉంటారో బయటకు తెలియదు. క్రికెట్‌ మైదానంలో ఉన్నంత చురుగ్గా, పరుగెత్తున్నట్టు మహీ బయట కనిపించడు’ అని సంజయ్‌ అన్నారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఓటమి తర్వాత మహీ మైదానంలో కనిపించలేదు. అంతర్జాతీయ మ్యాచులు ఆడలేదు. దాంతో వీడ్కోలుపై ఊహాగానాలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడటంపై సందిగ్ధం నెలకొంది. కరోనాతో ఐపీఎల్‌ వాయిదా పడటంతో అది మరింత ఎక్కువైంది. సెప్టెంబర్‌-19 నుంచి యూఏఈ వేదికగా లీగ్‌ జరుగుతుందని తెలియడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ధోనీకి ఇబ్బందులేమీ ఎదురుకావని మంజ్రేకర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘మహీ బాగా ఆడతాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించాలన్నా, విజయవంతం అవ్వాలన్నా నలుగురు లేదా ఐదుగురు నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొంటే చాలు. వారినెలా బోల్తా కొట్టించాలో మహీకి తెలుసు. పైగా యూఏఈ పరిస్థితులు సైతం అతడి ఆటతీరుకు సరిపోతాయి. అక్కడ పవర్‌ హిట్టింగ్ మాత్రమే కాదు బుద్ధి బలమూ ఉపయోగించాలి’ అని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని