close
Array ( ) 1

తాజా వార్తలు

అతనికి ఆ అధికారం ఎవరిచ్చారు? : గావస్కర్‌

ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌పై ఆగ్రహం

ముంబయి: ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ మల్హోత్రాపై టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతనెల ఓ జాతీయ పత్రికతో మాట్లాడిన అశోక్‌ ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకునేలా ఆలోచించాలని కోరాడు. ‘ఆటగాళ్ల జీతాలు తగ్గించడం సరికాదని నాకూ తెలుసు, కానీ బీసీసీఐకి గతంలో మాదిరిగా ఆదాయం రావట్లేదు. కాబట్టి.. ఇప్పుడు క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలి’ అని ఇండియన్‌ క్రికెటర్స్‌ ప్రెసిడెంట్‌ అన్నారు. 

దీనిపై స్పందించిన సునీల్‌ గావస్కర్‌.. ‘మల్హోత్రా బీసీసీఐకి మంచిచేశాలా ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే, ఆటగాళ్ల జీతాల్లో కోత విధింపులపై మాట్లాడటానికి అతనికి ఎవరు అధికారమిచ్చారనేదే అసలైన ప్రశ్న. ప్రస్తుత టీమ్‌ఇండియా ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు.. ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌లో సభ్యులు కాదు. అలాంటప్పుడు వాళ్ల తరఫున ఈయన మాట్లాడకూడదు. తమ జేబుకు చిల్లు పడనంత కాలం ఇతరుల జీతాల కత్తిరింపులపై మాట్లాడటం చాలా తేలిక’ అని గావస్కర్‌ ఓ మీడియాకు రాసిన వార్తలో పేర్కొన్నారు. 

అంతకుముందు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నా ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకు ఆ అంశం(ఆటగాళ్ల జీతాల్లో కోత) గురించి ఆలోచించలేదు. పరిస్థితులు చక్కబడ్డాక వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఇది పూర్తిగా రద్దయితే బీసీసీఐ భారీ నష్టాల్ని చవిచూసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఈ సీజన్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.