86 జట్లు.. 225 మ్యాచ్‌లు

తాజా వార్తలు

Published : 15/12/2020 11:01 IST

86 జట్లు.. 225 మ్యాచ్‌లు

 2022 టీ20 ప్రపంచకప్‌ అర్హత పోటీలు 

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం నిర్వహించే అర్హత పోటీల వివరాలను ఐసీసీ వెల్లడించింది. 13 నెలల పాటు సాగే ఈ పోటీల్లో 15 బెర్తుల కోసం 86 జట్లు పోటీపడనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 225 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో ఆస్ట్రేలియా నేరుగా బరిలో దిగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అర్హత పోటీలు ఆరంభమవుతాయి. అందుబాటులో ఉన్న 15 స్థానాలను సొంతం చేసుకునే జట్లను నాలుగు దశల క్వాలిఫయింగ్‌ విధానం ద్వారా తేల్చబోతున్నారు. ఇందులో భాగంగా అయిదు ప్రాంతాల వారీగా పదకొండు అర్హత టోర్నీలు నిర్వహించనున్నారు. హంగేరి, రొమేనియా, సెర్బియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో ఆడనుండగా.. ప్రాంతీయ టోర్నీల్లో 67 అసోసియేట్‌ జట్లు తలపడబోతున్నాయి. ఈ ప్రాంతీయ క్వాలిఫయర్స్‌ నుంచి 8 జట్లు గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. వీటికి తోడు.. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, ఐసీసీ టీ20 ర్యాంకుల ఆధారంగా నేరుగా ఎంట్రీ సంపాదించిన నేపాల్, సింగపూర్, యూఏఈ, జింబాబ్వేలతో కలిపి 16 జట్లతో గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌ నిర్వహిస్తారు. ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టాప్‌-11 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌ నుంచి మరో నాలుగు జట్లు మెగా టోర్నీకి అర్హత పొందుతాయి. షెడ్యూల్‌ ప్రకారం 2020లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా 2022కు వాయిదా పడింది. 

ఇవీ చదవండి..

తొలి టెస్టులో ఎవరెవరు?

రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని