Anushka-Sakhsi: బాల్యం నుంచే మిత్రులు
close

తాజా వార్తలు

Published : 17/05/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anushka-Sakhsi: బాల్యం నుంచే మిత్రులు

(Images:Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెటర్లు.. సినీ తారలు.. వారి భాగస్వాముల సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రముఖుల స్వస్థలాలు, వారు పుట్టిన చోటు, పెరిగిన ప్రదేశాలు, చదువుకున్న పాఠశాలలు, కళాశాలలు, చేసే పని గురించి శ్రద్ధ కనబరుస్తారు. ఎవరైనా సెలెబ్రిటీలు చిన్నప్పటి నుంచే స్నేహితులని తెలిసినా.. కలిసే చదువుకున్నారని తెలిసినా.. ‘అలాగా..’ అనుకుంటారు. ఎంఎస్‌ ధోనీ సతీమణి సాక్షి సింగ్‌, విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చిన్నప్పటి నుంచే మిత్రులని తెలియడంతో నెటిజన్లు షాకయ్యారు.

అవును.. అనుష్క శర్మ, సాక్షి సింగ్‌ ధోనీ బాల్యం నుంచే స్నేహితులు. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వీరిద్దరూ పాఠశాల, కళాశాలలో తీసుకున్న చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అనుష్క శర్మ తండ్రి కర్నల్‌ అజయ్‌ కుమార్ శర్మ ఒకప్పుడు అస్సాంలో పనిచేశారు. అదే సమయంలో సాక్షి కుటుంబం సైతం అక్కడే ఉండేది. దాంతో వీరిద్దరూ సెయింట్‌ మేరిస్‌ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. కలిసే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువే.

అనుష్క, సాక్షిది ఒకే బ్యాచ్‌. 1994 నుంచి కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత అనుష్క బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కళాశాలలో ఆర్ట్స్‌ చదివేందుకు వెళ్లింది. సాక్షి హోటల్‌ మేనేజ్‌మెంట్ చేసింది. ఇక ధోనీ, కోహ్లీలతో ఎవరికి ఎలా పరిచయం అయిందో, ఆపై వివాహ బంధంతో ఎలా ఒక్కటయ్యారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి చిత్రాలు వైరల్‌ మారాయి కానీ 2013లోనే ఓ ముఖాముఖిలో అనుష్క శర్మ వీరిద్దరి స్నేహం గురించి, ఒకే బడిలో చదువుకున్న విషయమూ చెప్పడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని