ప్చ్‌.. బోపన్నకు నిరాశ!

తాజా వార్తలు

Published : 10/02/2021 18:23 IST

ప్చ్‌.. బోపన్నకు నిరాశ!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్‌ మెక్లాహన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న అతడు.. తొలి రౌండ్‌లో సుంగ్‌ నమ్‌-మిన్‌ క్యు జంట చేతిలో 4-6, 6-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. గంట 17 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌లో బోపన్న జోడీ తేలిపోయింది. అయితే రెండో సెట్‌లో ప్రతిఘటించినప్పటికీ ఓటమి తప్పలేదు.

ఠిన క్వారంటైన్‌ నిబంధనల కారణంగా ప్రాక్టీస్‌కు తక్కువ సమయం లభించడం బోపన్న ఆటపై ప్రభావం చూపింది. భారత యువ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. నగాల్‌ 2-6, 5-7, 3-6తో రికార్డాస్‌ బెరాంకీస్‌ (లిథుయేనియా) చేతిలో ఓడాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత ఆటగాళ్లు దివిజ్‌ శరన్‌ (పురుషుల డబుల్స్‌), అంకిత రైనా (మహిళల డబుల్స్‌) పోరాటం మిగిలి ఉంది.

ఇదీ చదవండి
నగాల్‌ ఔట్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని