close

తాజా వార్తలు

Published : 27/02/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొతేరా పిచ్‌: కోహ్లీతో విభేదించిన కుక్‌

లండన్‌: మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వైఖరిని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ ప్రశ్నించాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనువుగానే ఉందన్న అతడి వ్యాఖ్యలతో విభేదించాడు. అసలు అలాంటి పిచ్‌పై ఆడటమే ఎంతో కష్టమని పేర్కొన్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లిష్‌ జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

‘విరాట్‌ కోహ్లీ మొతేరా పిచ్‌కు మద్దతుగా మాట్లాడాడు. అది పిచ్‌గా లేదు. దానిపై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. వికెట్‌ను పక్కన పెట్టి బ్యాట్స్‌మెన్‌ను నిందిస్తారా? పిచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించిందన్న విరాట్‌ అంచనా తప్పు’ అని కుక్‌ అన్నాడు.

‘విరాట్‌ కోహ్లీ, జోరూట్‌ మ్యాచ్‌లో ఆడారు. స్పిన్‌ను ఎదుర్కోగల గొప్ప ఆటగాళ్లూ ఉన్నారు. నిజమే, స్పిన్‌ను మెరుగ్గా ఆడటం నేర్చుకొనే క్రికెటర్లూ ఉన్నారు. కానీ దిగ్గజ ఆటగాళ్లూ స్పిన్‌ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు కదా. బంతి స్కిడింగ్‌ అవుతున్నప్పుడు ఎరుపు బంతితో ఏమైనా తేడా ఉంటుందేమో చూడాలి. ఏదేమైనా భారత్‌లోని అన్నింటికన్నా ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా టర్న్‌ అయిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. చాలా బంతులు నేరుగా వచ్చాయి. అంటే టర్న్‌ అయిన బంతులు విపరీతంగానే అయ్యాయి’ అని కుక్‌ తెలిపాడు.

మొతేరా పిచ్‌పై సరిగ్గా ఆడలేక చేతులెత్తేసిన ఇంగ్లాండ్‌కు మద్దతుగా కొందరు మాజీ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. పిచ్‌ టెస్టులకు పనికిరాదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్‌లో సీమింగ్‌ పిచ్‌లపై పేసర్లు వికెట్లు తీసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని భారత మాజీలు ప్రశ్నిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని