జ్వాల-విష్ణు: అతిథులకు ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 15:42 IST

జ్వాల-విష్ణు: అతిథులకు ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి

తాజాగా బయటపడ్డ సంగతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్‌ ఏప్రిల్‌ 22న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, బంధువుల మధ్యన ఒక్కటయ్యారు. కరోనా వైరస్‌ మహమ్మారి భయం పొంచివుండటంతో ఈ జోడీ ఓ కఠిన నిర్ణయం తీసుకుందని తాజాగా తెలిసింది. వేడుకకు హాజరయ్యే వారంతా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తేనే రావాలని వారు షరతులు విధించారట.

వివాహ మహోత్సవానికి సంబంధించిన చిత్రాలను గుత్తా జ్వాలా తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. నీలం రంగు డిజైనర్‌ పట్టు చీరలో జ్వాలా మెరిపోయింది. ఆమెకు సరిజోడుగా విష్ణు విశాల్‌ సైతం పట్టువస్త్రాల్లో మురిసిపోయారు. ‘ఏప్రిల్‌ 22 నాటి పెళ్లి చిత్రాలు. నిత్యం నావాళ్లు నాతోనే ఉండటం ఎంత అదృష్టమో’ అంటూ జ్వాల వ్యాఖ్య పెట్టింది. ‘మరో విషయం... పెళ్లికి హాజరవ్వాలంటే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి చేశాం’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి!!

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని