ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయి

తాజా వార్తలు

Updated : 24/01/2021 15:01 IST

ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయి

లండన్‌: వచ్చేనెలలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు వాటంతట అవే పడతాయని మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వామ్‌ అన్నాడు. అలాగే ఆ సిరీస్‌లో తమ జట్టు లెగ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ కీలక ఆటగాడిగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు జాక్‌‌ లీచ్‌, డామ్ ‌బెస్‌ చెరో ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. దీంతో వారిద్దరూ భారత్‌లోనూ సత్తా చాటాలని మాజీ స్పిన్నర్‌ ఆకాంక్షిస్తున్నాడు.

‘భారత్‌లో బంతి బాగా టర్న్‌ అవుతుంది,  తొలిరోజు వికెట్‌ ఫ్లాట్‌గా ఉన్నా దీనిని దృష్టిలోపెట్టుకొని ఓపికతో బౌలింగ్‌ చేయాలి. అప్పుడు భారత ఆటగాళ్లు కూడా బాగా ఆడతారు. రోజంతా ఓపికతో బౌలింగ్‌ చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయి. అయితే, అందుకోసం బాగా కష్టపడాలి. ఆ క్రమంలో కాస్త ఓపిక నశించినా అదేం పెద్ద సమస్య కాదు’ అని స్వాన్‌ పేర్కొన్నాడు. 

‘భారత్‌లో జాక్‌ కీలక బౌలర్‌గా మారతాడు. అతడు మిడిల్‌ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులేస్తే సరిపోతుంది. ఇంగ్లాండ్‌ జట్టు ఒకవైపు జాక్‌తో బౌలింగ్‌ చేయిస్తూనే మరోవైపు ఇతరులను రొటేట్‌ చేయాలి. ఇంతకుముందు టీమ్‌ఇండియా రోజు రోజుకూ మెరుగవుతుందని అనుకున్నా.. నిజం చెప్పాలంటే, భారత్‌ మేటి జట్టే అయినా నిజంగా అంత అత్యుత్తమ జట్టా?అనుకునేవాడిని’ అని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్‌ ఈనెల 27న చెన్నై చేరుకుంటుంది. అక్కడే ఫిబ్రవరి 5న టీమ్‌ఇండియాతో తొలి టెస్టు ఆడనుంది. రెండోటెస్టు కూడా చెన్నైలోనే జరగనుంది. ఆపై అహ్మదాబాద్‌లో మరో రెండు టెస్టులు జరగనున్నాయి.  

ఇవీ చదవండి..
ద్రవిడ్‌ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్‌
‘301’ క్యాప్‌.. వెలకట్టలేని సంపద


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని