ఆర్‌సీబీ కాకుంటే సీఎస్‌కేను ఎంచుకుంటా

తాజా వార్తలు

Updated : 05/06/2021 22:11 IST

ఆర్‌సీబీ కాకుంటే సీఎస్‌కేను ఎంచుకుంటా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ ఇద్దరూ మెరుగైన సారథులేనని టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అంటున్నాడు. సొంత సామర్థ్యంపై విశ్వాసం ఉండాలని, ఏకాగ్రతతో ఆడాలని మహీ తనకు సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు. ఒకవేళ ఆర్‌సీబీకి కాకుండా మరో జట్టుకు ఆడాల్సి వస్తే చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎంచుకుంటానని తెలిపాడు.

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులు లేకపోవడమే ఇందుకు కారణం. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సైతం నిరవధికంగా వాయిదా పడటంతో జీవిత భాగస్వామితో సమయం ఆస్వాదిస్తున్నాడు. తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కొన్ని విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ, ధోనీ మెరుగైన సారథులేనని అన్నాడు.

మూడు పదాల్లో విరాట్‌ కోహ్లీ గురించి చెప్పాలంటే ‘క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం’ అని యూజీ వివరించాడు. అవకాశం వస్తే విశ్వనాథన్‌ ఆనంద్‌తో చదరంగం ఆడాలని ఉందన్నాడు. పబ్‌జీ ఎక్కువగా ఆడితే తన సతీమణి ధనశ్రీ ఊరుకోదన్నాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడంతో తన కెరీర్లో మర్చిపోలేని సందర్భంగా పేర్కొన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కాకుండా మరో ఫ్రాంచైజీకి ఆడమంటే చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎంచుకుంటానని తెలిపాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత అందుకోవడం తన లక్ష్యమని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని