close

తాజా వార్తలు

Published : 09/04/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గెలిచినా.. ఓడినా తేడా ఉండనివ్వరు: సూర్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానం ఆవల తమ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుందని ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. అందులో విచిత్రమైన మనస్తత్వాలు కనిపిస్తాయని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-21 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కు ముందు అతడు మాట్లాడాడు.

‘డ్రస్సింగ్‌ రూమ్‌లో మా జట్టు వైవిధ్యంగా ఉంటుంది. మైదానంలో చూసిందానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఆటగాళ్లు ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య.. గెలిచినా ఓడినా సరదాగానే ఉంటారు. వాళ్లను మరోవైపు నుంచి చూస్తే మీరు షాకవుతారు! ఎందుకంటే డ్రస్సింగ్‌ రూమ్‌లో వింత వింత మనస్తత్వాలు కనిపిస్తాయి’ అని సూర్యకుమార్‌ తెలిపాడు. 

‘వారి వల్లే ఫలితాల ప్రభావం మాపై ఉండదు. మేం గెలిస్తే వాతావరణం చాలా బాగుంటుంది. ఓడినా.. సంతోషకరమైన వాతావరణం ఉండేలా చేస్తారు.  గెలిచినా.. ఓడినా.. ఒకే రకంగా ఉండటం ద్వారానే మనలో అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది’ అని సూర్య అన్నాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని