close

తాజా వార్తలు

Published : 19/01/2021 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గబ్బా టెస్టు: శుభ్‌మన్‌ గిల్‌ అర్ధశతకం

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (53*) అర్ధశతకం సాధించాడు. హేజిల్‌వుడ్‌ వేసిన 29వ ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు చేసి ఈ సిరీస్‌లో రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 29 ఓవర్లకు 66/1 స్కోర్‌ సాధించింది. 4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ టిమ్‌పైన్‌కు చిక్కడంతో 18 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ఆపై శుభ్‌మన్‌ గిల్‌, పుజారా (6*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత్‌ విజయానికి ఇంకా 262 పరుగులు కావాలి.

ఇవీ చదవండి..

స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌
సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని