Team India: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టం!
close

తాజా వార్తలు

Published : 23/06/2021 01:26 IST

Team India: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టం!

ఆ జట్టు మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌

లండన్‌: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే టీమ్‌ఇండియా శక్తికి మించి కష్టపడాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ అన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌ ముగిసే సరికి కోహ్లీసేన మానసికంగా అలసిపోతుందని పేర్కొన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ చావోరేవో అన్నట్టుగా ఉంటుందని అంచనా వేశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వల్ల భారత్‌ అత్యుత్తమంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందన్నాడు.

‘టీమ్‌ఇండియా చాలారోజులు ఇక్కడ ఉండనుంది. అందుకే పర్యటన ముగిసే సరికి మానసికంగా అలసిపోవచ్చు. కోహ్లీసేన ఆరంభం బాగానే ఉండొచ్చు. కానీ ఐదు టెస్టుల సిరీసులో నిలకడ చాలా కష్టం. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించడం శక్తికి మించిన పని. అందుకే భారత్‌పై ఆరంభ మ్యాచులోనే పైచేయి సాధిస్తే రూట్‌ సేన గెలవకపోవడానికి కారణాలు కనిపించడం లేదు’ అని కుక్‌ అన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ రొటేషన్‌ విధానం బాగాలేదని కుక్‌ విమర్శించాడు. భారత్‌లో 1-3, న్యూజిలాండ్‌ చేతిలో 1-0తో ఓడిపోవడంపై అతడు స్పందించాడు. ‘ఈ విధానం రూట్‌ను ఇబ్బంది పెడుతోంది. నేను నిజాయతీగా అతడిపై సానుభూతి చూపుతున్నాను. జట్టుకు కోచ్‌గా లేదా కెప్టెన్‌గా లేదా సెలక్టర్‌గా ఉంటే వారి పనితీరును ఫలితాల ఆధారంగానే విశ్లేషిస్తారు. కానీ రూట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు’ అని అన్నాడు.

‘అనుభవజ్ఞులైన బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌ వంటివాళ్లు లేకుండా గెలవడం కష్టం. రొటేషన్‌ వల్ల వీరంతా అందుబాటులో ఉండటం లేదు. పైగా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌ వంటి ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఏదేమైనా టీమ్‌ఇండియా సిరీసులో డామ్‌ సిబ్లీ, జాక్‌ క్రాలీ, ఒలీ పాప్‌, డాన్‌ లారెస్స్‌తో కూడిన టాప్‌ ఆర్డర్‌లో మార్పులు చేయొద్దు’ అని కుక్‌ హెచ్చరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని