WTC Final: కోహ్లీసేనపై వాన్‌ వ్యంగ్యాస్త్రాలు!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:53 IST

WTC Final: కోహ్లీసేనపై వాన్‌ వ్యంగ్యాస్త్రాలు!

ఘాటుగా బదులిచ్చిన టీమ్‌ఇండియా అభిమానులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ టీమ్‌ఇండియాపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. పదేపదే ఎగతాళిగా.. వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తూ కవ్విస్తున్నాడు. తాజాగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శనపై వెటకారంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన భారత్‌ అభిమానులు అతడిపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

‘ఒకవేళ ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరో చోట నిర్వహిస్తే ఒక్క నిమిషమైనా ఆట కోల్పోయేవాళ్లు కాదు. మరో విషయం.. ఈ పాటికి న్యూజిలాండ్‌ విజేతగా ఆవిర్భవించేది!!’ అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రతిసారీ టీమ్‌ఇండియాను ఎగతాళి చేస్తుండటంతో అభిమానులు ఇంగ్లాండ్‌ను, వాన్‌ను ఎత్తిపొడుస్తున్నారు. ఇంగ్లాండ్‌ అంత గొప్ప జట్టైతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఎందుకు ఫైనల్‌కు చేరుకోలేదని ప్రశ్నించారు. బౌండరీల నిబంధనే లేకుంటే ఆంగ్లేయులు  ప్రపంచకప్‌ను ఓడిపోయేవారని, కివీస్‌ విజేతగా ఆవిర్భవించేదని అన్నారు.

కాగా ఫైనల్‌ పోరు ఆఖరి రోజుకు చేరుకుంది. ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వు డేను ఉపయోగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 217 పరుగులకు ఆలౌట్‌ అయింది. డేవాన్‌ కాన్వే(54), కేన్‌ విలియమ్సన్‌ (49) రాణించడంతో న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. ఆ తర్వాత 32 పరుగుల లోటుతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా ఐదోరోజు ఆట ముగిసే సరికి 64/2తో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చెతేశ్వర్‌ పుజారా (12 బ్యాటింగ్‌; 55 బంతుల్లో 2×4), విరాట్‌ కోహ్లీ (8 బ్యాటింగ్‌; 12 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని