close

తాజా వార్తలు

Published : 05/05/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

CSK, SRHలో మరింత మందికి పాజిటివ్‌?

ఆటగాళ్లతో మాట్లాడిన సాహా, హస్సీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడినా ఆటగాళ్ల కరోనా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఒకరి నుంచి మరొకరి వైరస్‌ సోకుతుందేమోనని భయపడుతున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో మరింత మందికి పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మొదట బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి వైరస్‌ సోకింది. దాంతో జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లింది. కానీ బాలాజీ గురించి తెలిసిన మరుసటి రోజే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీకీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. ఫలితానికి రెండు రోజుల ముందు ఆయన సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌తో స్వయంగా 15-20 నిమిషాలు మాట్లాడాడు. అంతేకాకుండా మరికొందరు ఆటగాళ్లతోనూ చర్చించాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ జట్టులో మరింత మందికి పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా విషయంలోనూ ఇలాగే జరిగినట్టు తెలిసింది. అతడిలో లక్షణాలు కనిపించగానే జట్టు నుంచి విడదీసి ఐసోలేషన్‌కు పంపించారు. కానీ అంతకన్నా ముందే అతడు జట్టులోని ప్రతి ఒక్కరినీ కలిసినట్టు సమాచారం. అందుకే జట్టు సభ్యులు భయపడి ముంబయి ఇండియన్స్‌తో ఆడేందుకు ఇష్టపడలేదని ఫ్రాంచైజీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చూస్తుంటే చాలామంది ఆటగాళ్లు వైరస్‌ బారిన పడేట్టే కనిపిస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని