ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌

తాజా వార్తలు

Updated : 21/02/2021 17:33 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించాడు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగినా.. తర్వాతి రెండు సెట్లలో అతడే‌ పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన అతడు.. 20 విన్నర్లు కొట్టాడు.

కాగా, జకోవిచ్‌కు తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌. అయితే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడం ఇది తొమ్మిదోసారి. వరుసగా గత మూడుసార్లు ఈ టైటిల్‌ను అందుకున్నాడు. అంతేగాక అతడు ఆడిన అన్ని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం విశేషం. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మరోవైపు ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి జకోవిచ్‌ మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు. ఫెదరర్‌, నాదల్ చెరో 20 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని