BCCI: వచ్చే ఏడాది ఆరంభంలో రంజీ ట్రోఫీ

తాజా వార్తలు

Published : 01/09/2021 01:19 IST

BCCI: వచ్చే ఏడాది ఆరంభంలో రంజీ ట్రోఫీ

ఈడెన్‌ గార్డెన్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌

ఇంటర్నెట్‌ డెస్కు: దేశవాళీ రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి రంజీ మ్యాచులను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. దీంతో ఈసారి రంజీ మ్యాచుల నిర్వహణపై ప్రేక్షకుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది రంజీ ట్రోఫీని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లందరినీ ఐదు రోజుల పాటు క్వారంటెయిన్‌లో ఉంచనుంది. అనంతరం ట్రోఫీ ప్రారంభానికి ముందు రెండు రోజుల పాటు ప్రాక్టీసు చేసుకునేందుకు అవకాశమిచ్చింది.

క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచులను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. నాకౌట్ దశకు చేరుకున్న జట్లన్నింటినీ కోల్‌కతాలో మరోసారి అయిదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. అనంతరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు నాకౌట్‌ మ్యాచులు నిర్వహిస్తారు. మార్చి 8 నుంచి 12 వరకు సెమీ ఫైనల్స్‌ , మార్చి 16 నుంచి 20  ఫైనల్స్‌ జరుగనున్నాయి.  

ఏ గ్రూపులో ఏ జట్టు.. ఎక్కడ?
వచ్చే ఏడాదిలో జరగనున్న రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్లను 6 గ్రూపులుగా విభజించారు. ప్రతి ఎలైట్‌ గ్రూపుల్లో 6 జట్లు, ప్లేట్‌ గ్రూపులో 8 జట్లు తలపడనున్నాయి. ఆ వివరాలివీ..
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’: గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, సర్వీసెస్ మరియు అస్సాం జట్లు (ముంబయిలో)
ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’: బెంగాల్‌, విదర్భ, రాజస్థాన్‌, కేరళ, హరియాణా, త్రిపుర (బెంగళూరులో)
ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’: కర్ణాటక, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, మహారాష్ర్ట, ఉత్తరాఖండ్‌ (కోల్‌కతాలో)
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’: సౌరాష్ర్ట, తమిళనాడు, రైల్వేస్‌, జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌, గోవా (అహ్మదాబాద్‌లో)
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఈ’: ఆంధ్రా, ఉత్తరప్రదేశ్‌, బరోడా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి (త్రివేండ్రంలో)
ప్లేట్‌ : ఛండీగఢ్‌, మేఘాలయ, బిహార్‌, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ (చెన్నైలో)

సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది నవంబరు 4 ఈ టోర్నీ ప్రారంభం కానుంది. లఖ్‌నవూ, గువాహటి, బరోడా, దిల్లీ, హరియాణా, విజయవాడలలో మ్యాచులు జరుగనున్నాయి. మరోవైపు, అదే సంవత్సరం డిసెంబరు 8-27 మధ్య విజయ్‌ హజారే ట్రోఫీని సైతం నిర్వహించనుంది. అయితే, ఈ ట్రోఫీకి ఇంకా వేదికలను ఖరారు చేయలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని