WTC Final: భోజన విరామం.. భారత్‌ 211/7
close

తాజా వార్తలు

Published : 20/06/2021 17:43 IST

WTC Final: భోజన విరామం.. భారత్‌ 211/7

అర్ధశతకాలు చేజార్చుకున్న కోహ్లీ, రహానె..

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఆదివారం మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి 211/7 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(15), ఇషాంత్‌ శర్మ(2) పరుగులతో ఉన్నారు. అంతకుముందు 146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(44), వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె(49) అర్ధశతకాలు పూర్తి చేసుకోకముందే పెవిలియన్‌ చేరారు. మధ్యలో రిషభ్‌పంత్‌(4) సైతం నిరాశపర్చాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే జేమీసన్‌.. కోహ్లీ, పంత్‌ను ఔట్ చేయగా వాగ్నర్‌.. రహానెను అర్ధశతకానికి ఒక పరుగు ముందు బోల్తాకొట్టించాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 182/6గా నమోదైంది. ఈ నేపథ్యంలోనే జోడీ కట్టిన అశ్విన్‌(22), జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోర్‌ 200 దాటాక అశ్విన్‌ సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో భారత్‌ 205 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. తర్వాత జడ్డూ, ఇషాంత్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌ మూడు వికెట్లు తీయగా వాగ్నర్‌ రెండు.. బౌల్ట్‌, సౌథీ చెరో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని