Sports News: ఆటోడ్రైవర్‌ కుమార్తెకు మూడు స్వర్ణాలు

తాజా వార్తలు

Published : 19/09/2021 09:30 IST

Sports News: ఆటోడ్రైవర్‌ కుమార్తెకు మూడు స్వర్ణాలు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: హనుమకొండలో జరుగుతున్న జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో తమిళనాడుకు చెందిన ఆర్‌.విత్య రాంరాజ్‌ మూడు బంగారు పతకాలు సాధించింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో, 400 మీటర్ల పరుగులో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. పసిడి సాధించిన 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో ఆమె సభ్యురాలు. నిత్య తండ్రి రాంరాజ్‌ ఆటోడ్రైవర్, తల్లి మీనా గృహిణి. విత్య కవల సోదరి నిత్య కూడా అథ్లెటే. ఆదివారం జరిగే 10 ఈవెంట్ల ఫైనల్స్‌తో పోటీలు ముగుస్తాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీతోపాటు ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ హాజరుకానున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని