Tokyo Olympics: స్విమ్మింగ్‌లోనిరాశపర్చిన మానా పటేల్‌

తాజా వార్తలు

Published : 25/07/2021 17:40 IST

Tokyo Olympics: స్విమ్మింగ్‌లోనిరాశపర్చిన మానా పటేల్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్‌ మానా పటేల్‌ ఆదివారం నిరాశపర్చింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగం హీట్‌-1లో ఆమె రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మానాపటేల్‌ ‘యూనివర్సాలిటీ కోటా’ కింద ఈ విశ్వక్రీడల్లో పోటీపడుతోంది. ఈ క్రమంలోనే నేడు జరిగిన మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో రెండో స్థానంలో నిలిచి మొత్తంగా 39వ స్థానం సంపాదించింది. దాంతో సెమీఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. మానా 1:05.20 నిమిషాల్లో ఈ పోటీలను పూర్తి చేయగా జింబాబ్వేకు చెందిన స్విమ్మర్‌ డొటానా కటాయి 1:02.73 నిమిషాల్లో పూర్తి చేసి తొలి స్థానం సంపాదించింది. ఇక గ్రెనాడాకు చెందిన కింబర్లీ ఇన్స్‌ 1:10.24 నిమిషాల్లో మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ టాప్‌-16లో నిలిచిన స్విమ్మర్లే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని