Kohli: ఇన్‌స్టాలో ఒక పోస్టుకు రూ.5 కోట్లు

తాజా వార్తలు

Updated : 02/07/2021 12:55 IST

Kohli: ఇన్‌స్టాలో ఒక పోస్టుకు రూ.5 కోట్లు

క్రికెటర్లలో ఎక్కువ ఆర్జన కోహ్లీదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆటలోనే కాదు ఆర్జనలోనూ తనను మించిన వారు లేరని చాటాడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో టాప్‌-20లో నిలిచాడు. ఇన్‌స్టాలో ఒక పోస్టుకు అతడు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలిసింది.

హాపర్‌హెచ్‌క్యూ 2021 అనే సంస్థ ఈ మధ్యే ‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇందులో పుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. భారత కరెన్సీ ప్రకారం వీరిద్దరూ ఒక్కో పోస్టుకు రూ.11 కోట్లకు పైగా తీసుకుంటున్నారట. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచారు.

‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌’లో టాప్‌-20లో నమోదైన ఏకైక క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమే. 19వ స్థానంలో ఉన్న అతడు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయ వ్యక్తి ప్రియాంక చోప్రా. 27వ స్థానంలో నిలిచిన ఆమె ఒక పోస్టుకు రూ.3 కోట్ల వరకు తీసుకుంటుందని తెలిసింది.

ఫుట్‌బాల్‌ స్టార్లే ఎక్కువగా ఆర్జిస్తున్నారని ఈ జాబితా ద్వారా అర్థమవుతోంది. అర్జెంటీనా ఆటగాడు లయోనల్‌ మెస్సీ రూ.8.6 కోట్లు, బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ రూ6.1 కోట్లు తీసుకుంటున్నారు. మొత్తం 395 మందితో రూపొందించిన ఈ జాబితాలో టీమ్‌ఇండియా నుంచి మరే క్రికెటర్‌కు చోటు దక్కలేదు. ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌, డేల్‌ స్టెయిన్‌కు చోటు దొరకడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని