రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 11:41 IST

రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: రైతు ఉద్యమంపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు చేస్తున్న ట్వీట్ల నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ట్వీట్‌ చేసి దేశం మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ‘భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. అందరం శాంతియుతంగా సమష్టిగా ముందుకు వెళ్లేలా అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.  

దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. రైతులకు మద్దతు ప్రకటించారు. కాగా, వీరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని మండిపడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలబ్రిటీలు సమర్థించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పాటు, బాలీవుడ్‌ స్టార్లు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కోహ్లీ కూడా వారితో స్వరం కలిపాడు. 

మరోవైపు శుక్రవారం నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం కోహ్లీ తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత విరాట్‌ భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 11న తన భార్య అనుష్కశర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇప్పుడతడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టు రహానె సారథ్యంలో ఆసీస్‌ను ఓడించి చారిత్రక విజయం సాధించింది. ఇప్పుడిక ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరాలంటే కచ్చితంగా ఈ సిరీస్‌ గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో విరాట్‌ ఆట కీలకంగా మారనుంది. 

ఇవీ చదవండి..
సామాజిక సమరం
భారత్‌పై మీ ప్రేమకు అమితానందం.. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని