close

ఛాంప్‌ నిజాం క్రికెట్‌ క్లబ్‌ 

వింటర్‌ ప్రిమియర్‌ లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వింటర్‌ ప్రిమియర్‌ లీగ్‌ జూనియర్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌ టైటిల్‌ను నిజాం క్రికెట్‌ క్లబ్‌ సొంతం చేసుకుంది. ఎస్‌ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫైనల్లో నిజాం క్రికెట్‌ క్లబ్‌ 8 వికెట్ల తేడాతో లీగల స్పోర్ట్స్‌ అకాడమీపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన లీగల స్పోర్ట్స్‌ అకాడమీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులు చేసింది. ఆ జట్టులో క్రాంతి (49) రాణించాడు. రాహుల్‌ రెడ్డి (3/11), రోహన్‌ రెడ్డి (4/9) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో యశ్‌ మిశ్రా (71 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో చెలరేగడంతో నిజాం క్రికెట్‌ క్లబ్‌ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.