
ప్రధానాంశాలు
ఇక్కడ రెడ్ బాల్ ఉండాలి కదండీ: వీడియో వైరల్
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్లో సరదా సంఘటనలకు కొదవుండదు. సీరియస్‌గా ఆడుతున్నా కొన్నిసార్లు కామెడీ సన్నివేశాలుగా మారిపోతుంటాయి. ఒక్క బంతికే ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌటవ్వడం, క్యాచ్‌లు జారవిడవడం వంటి వీడియోలు ఆ కోవలోకే వస్తుంటాయి. అయితే గాలె వేదికగా జరిగిన శ్రీలంక×ఇంగ్లాండ్ రెండో టెస్టులోనూ ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అది కాస్త ఫన్నీగా ఉండటంతో నెట్టింట్లో వైరల్ మారింది.
అసలు ఏం జరిగిందంటే.. రమేశ్ మెండిస్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో భారీ షాట్ ఆడాడు. ఫైన్ లెగ్ మీదుగా అది బౌండరీ అవతల పడింది. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి వైట్ పెయిటింగ్ డబ్బాలో పడింది. దీంతో రెడ్ బాల్ కాస్త వైట్ బాల్‌గా మారింది. దాన్ని ఎంత శుభ్రం చేసినా తిరిగి ఉపయోగించలేని పరిస్థితి. దీంతో అంపైర్లు మరో బంతిని శ్రీలంక బౌలర్లకు అందించారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘సుదీర్ఘ ఫార్మాట్ రెడ్ బాల్‌తో కదా ఆడేది.. కానీ ఇక్కడ వైట్ బాల్ ఉందేంటి?’ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో లంకపై ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టెస్టుల్లో రెడ్ బాల్, పరిమిత ఓవర్ల క్రికెట్లో వైట్ బాల్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
దాదా కాల్ చేశాడు.. క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె
అంచనాలు వద్దు.. ఒత్తిడి పెంచొద్దు: గంభీర్
ప్రధానాంశాలు
సినిమా
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- నేనున్నానని..
- యువతిపై 60 మంది అత్యాచారం!
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- రివ్యూ: పవర్ ప్లే
- పేలింది పంత్ పటాకా
- మనసు లాగుతోందా బంగారం
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
