
ప్రధానాంశాలు
కేంద్ర మంత్రికి షాకిచ్చిన హనుమ విహారి
ఇంటర్నెట్ డెస్క్: తనను అవమానిస్తూ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్‌మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమవిహారి ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న జట్టును ఓటమి పాలవ్వకుండా ఉండేందుకు అశ్విన్‌తో కలిసి 259 బంతుల్ని డిఫెండ్ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడు పోరాడిన తీరుకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా ట్వీట్ చేశారు.
‘7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని హనుమబిహారి చంపేయడమే కాదు క్రికెట్‌ను హత్య చేశాడు. గెలుపు అవకాశాలు నిలపలేని అతడు ఒక నేరస్థుడు. నోట్: క్రికెట్ గురించి నాకేమీ తెలియదని నాకు తెలుసు’ అంటూ జనవరి 11న సుప్రియో ట్వీట్ చేశాడు. విహారిని అవమానించడమే కాకుండా అతడి పేరును ‘బిహారి’ అని రాశాడు. దీనికి ఈ తెలుగు క్రికెటర్ అత్యంత హుందాగా.. చతురతతో స్పందించాడు. ‘హనుమ విహారి’ అని మంత్రికి బదులిచ్చాడు. దాంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చావని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఐపీఎల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు
ప్రధానాంశాలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
