close
గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేయండి

వైద్య మంత్రి ఈటల ఆదేశాలు
జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకాలపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.  జాతీయ ఆరోగ్యమిషన్‌ పథకాల అమలుపై మంగళవారం ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితారాణా, ఆరోగ్య మిషన్‌ పథకాల ముఖ్యఅధికారి డాక్టర్‌ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్యశాఖ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దని, చిన్నచిన్న కారణాలతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఉన్నతాధికారులకు మంత్రి హితవు చెప్పినట్లు సమాచారం. పదేపదే సమీక్ష సమావేశాలు నిర్వహించి కాలాన్ని వృథా చేయొద్దని, నెలకోసారి సమీక్షిస్తే సరిపోతుందని ఉన్నతాధికారులకు మంత్రి ప్రత్యేకంగా సూచించినట్లు తెలిసింది.

మంత్రి సూచనలివీ..
* ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగుదలపై దృష్టిపెట్టాలి. బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్యులే పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారులుగా వ్యవహరిస్తుండడంతో ఫలితాలు అంతగా ఉండడం లేదు. ప్రత్యేకంగా పాలనాధికారులను నియమించి, పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకొచ్చే వైద్యులకు వేతనాలు పెంచడంతోపాటు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
* ఆరోగ్య ఉపకేంద్రం స్థాయి నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని స్థాయిల సమాచారాన్ని ఒకే గూటికి చేర్చే విధంగా సమీకృత ఐటీ విధానాన్ని వైద్య శాఖలో అమలు చేయాలి.
* ఆశాలు, ఏఎన్‌ఎంలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. వారిలో అర్హులైన వారికి నర్సులుగా అవకాశాలివ్వాలి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.