close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అర్బన్‌ ‘భగీరథ’ వేగంగా పూర్తి చేయాలి

మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణాల్లో మిషన్‌ భగీరథ పనులను వేగంగా పూర్తి చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. పట్ణణాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ (అర్బన్‌) పనులపై ప్రగతిభవన్‌లో మంత్రి మంగళవారం సమీక్షించారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. పనుల్లో ప్రభుత్వ విభాగాల సమన్వయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్బన్‌ మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మిషన్‌ భగీరథ దేశ చరిత్రలోనే గొప్ప ప్రాజెక్టు అని.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ దీనికి శ్రీకారం చుట్టారని అన్నారు.

రూ.250 కోట్ల నిధుల విడుదల
ఇంటింటికి తాగునీరు అందించి  మిషన్‌ భగీరథ పనుల కోసం రూ.250 కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.