close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండు రోజుల్లో సమగ్ర నివేదిక!

సమాచారాన్ని సేకరిస్తున్న విజిలెన్స్‌ అధికారులు 

ఈనాడు, మెదక్‌: జమునా హేచరీస్‌ భూముల వ్యవహారమై విజిలెన్స్‌ అధికారులు మూడోరోజూ విచారణ కొనసాగించారు. ఈ సంస్థ పేరిట కెనరా బ్యాంకులో తీసుకున్న రుణంపై సమాచారాన్ని సేకరించారు. 55 ఎకరాల పట్టా భూమికి సంబంధించి దస్త్రాలను బ్యాంకులో పెట్టి రూ. 93 కోట్ల రుణం తీసుకున్నట్లు గుర్తించారు. దేవరయాంజాల్‌లోని మరో 44 ఎకరాలనూ చూపినట్లు తేల్చారు. ఇవన్నీ పట్టా భూములేనని బ్యాంకు అధికారులకు చెప్పినట్లు సమాచారం. సర్వే సంఖ్యలు 130లో 3 ఎకరాలు, 81లో 5.36 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులూ బ్యాంకుకు అందించారు. వాటిని సీతారామారావు అనే వ్యక్తి నుంచి కొన్నట్లు గుర్తించారు.

విజిలెన్స్‌ విభాగం మరో రెండురోజుల్లో ఈ వ్యవహారాలన్నింటిపైనా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అసైన్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్లను కొట్టారనే విషయమై అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. చాలా వరకు చిన్న చిన్న పొదలే తొలగించారని గుర్తించారు. జమునా హేచరీస్‌ షెడ్ల వద్ద ఉన్న నల్లాతో పాటు పైప్‌లైన్‌ను ఆదివారం అధికారులు తొలగించి గుంతలను పూడ్చి వేయగా తర్వాత హేచరీస్‌ సిబ్బంది వాటిని మళ్లీ బిగించుకోవడం గమనార్హం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు