కాపునాడు వ్యవస్థాపకుడు పిళ్లా వెంకటేశ్వరరావు మృతి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాపునాడు వ్యవస్థాపకుడు పిళ్లా వెంకటేశ్వరరావు మృతి

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపునాడు వ్యవస్థాపకుడు పిళ్లా వెంకటేశ్వరరావు(82) బుధవారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1991లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగపై కార్పొరేటర్‌ అభ్యర్థిగా, 1983లో కంకిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని నెహ్రూపై ఓడిపోయారు. రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పించాలని కోరుతూ ఆయన అనేక ఉద్యమాలు చేశారు. ఆయన కృషి కారణంగానే కాపు కార్పొరేషన్‌ ఏర్పాటైంది. వెంకటేశ్వరరావు కుమారై శ్రీదేవి గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్‌ డైరెక్టరుగా పని చేశారు.పిళ్లా వెంకటేశ్వరరావు మృతిపై సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, విచారం వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు