వైరస్‌పై పోరుకు వేంకన్న అండ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌పై పోరుకు వేంకన్న అండ

తిరుమల, న్యూస్‌టుడే: కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం ఏపీలో 22 జర్మన్‌ షెడ్లు నిర్మించేందుకు రూ.3.52 కోట్లు మంజూరు చేస్తూ తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కొవిడ్‌ ఆసుపత్రి వద్ద షెడ్‌ నిర్మించి, ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తేవడంతో ఈ తరహా ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని తితిదేకు విన్నపాలు వచ్చాయి. దీంతో ఈవో శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయనిధి నుంచి నిధులు మంజూరు చేశారు. విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశం-2, అనంతపురం-3, కృష్ణా-3, కర్నూలు- 2, గుంటూరు-3, కాకినాడలో మూడింటితోపాటు ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నారు. ఒక షెడ్‌లో 30 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయొచ్చు.
శ్రీవారి దర్శనానికి తగ్గుతున్న భక్తులు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుతోంది. మంగళవారం అత్యల్పంగా 2,262 మంది దర్శించుకోగా.. బుధవారం మరింత తగ్గి 2,141 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం రూ.17 లక్షలు లభించింది. భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలుచేసిన భక్తులకు ఈ సంవత్సరం ఆఖరు వరకు ఒక పర్యాయం దర్శన తేదీని మార్చుకునే అవకాశాన్ని తితిదే కల్పించిన విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని