పొలాలకు వెళ్లి.. ప్రవాహంలో చిక్కి
close

ప్రధానాంశాలు

పొలాలకు వెళ్లి.. ప్రవాహంలో చిక్కి

కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలంలోని చింతకర్ర గ్రామం కిసన్‌నాయక్‌ తండాకు చెందిన నలుగురు రైతులు, 26 మంది కూలీలు పత్తి విత్తనాలు విత్తడానికి గురువారం ఉదయం పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వారు చింతకర్ర వాగు వద్దకు చేరుకున్నారు. ప్రవాహం తక్కువ ఉండడంతో దాటగలమని భావించి వాగులోకి దిగగా నీటి శాతం పెరిగి అందులో చిక్కుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని తాడు సహాయంతో వారిని ఒడ్డుకు లాగారు.

-జైనూర్‌, న్యూస్‌టుడేTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని