హలో అంజయ్యా.. బాగున్నావా
close

ప్రధానాంశాలు

హలో అంజయ్యా.. బాగున్నావా

దత్తత గ్రామం వాసాలమర్రి సర్పంచికి సీఎం ఫోన్‌

తుర్కపల్లి, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 22న ఆ ఊరిని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి పోగుల ఆంజనేయులుకు సీఎం శుక్రవారం స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. గత ఏడాది నవంబరు 1న ఎర్రవల్లిలో గ్రామస్థులతో సమావేశమై వాసాలమర్రిని దత్తత తీసుకొంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజా పర్యటన నేపథ్యంలో సర్పంచి ఆంజనేయులుతో సీఎం ఫోన్లో సంభాషించారు. కరోనా కారణంగా గ్రామంలో తన పర్యటన ఆలస్యమైందని చెప్పారు. కుల, మత భేదాలు లేకుండా ఊరి జనం అందరితో కలిసి తాను సహపంక్తి భోజనం చేస్తానని, ఆ ఏర్పాట్లన్నీ అధికారులు చూసుకుంటారని, మీకేమీ ఇబ్బంది లేదని తెలిపారు. సమావేశానికి అనువైన స్థలాన్ని అధికారులతో కలిసి ఎంపిక చేయాలని సర్పంచికి సూచించారు. ఇది మంచి ప్రాజెక్టు అని, రాజకీయాలకు అతీతంగా ఊరిలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని